ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్

ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్

జీడిమెట్ల, వెలుగు: ఫ్యామిలీ సర్టిఫికెట్​ కోసం లంచం తీసుకుంటూ హైదరాబాద్​ సిటీలోని కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ ఆఫీస్​లో పని చేసే జూనియర్​ అసిస్టెంట్​ ఏసీబీకి చిక్కాడు. సిటీ రేంజ్​ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ ఆఫీస్​లో జూనియర్​ అసిస్టెంట్​ జి. గణేశ్​ ఇన్​చార్జి గ్రామ పరిపాలన అధికారిగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ కోసం దరఖాస్తు చేసుకోగా, గణేశ్​ రూ.30 వేలు డిమాండ్​ చేయగా, తగ్గించమని కోరడంతో రూ.20 వేలకు ఒప్పందం చేసుకున్నాడు.

రెండు రోజుల కింద రూ.5 వేలు అందజేసి, ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం గణేశ్​కు బాధితుడు రూ.15వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.